Thursday, April 16, 2009

అంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం - ౨౦౦౯ (2009)

అంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం - ౨౦౦౯ (2009)
నాయకుల బలాబలాలు 
రాజశేఖర రెడ్డి
బలాలు:
  • పోరాట పటిమ, సహజ నాయకత్వ లక్షణాలు,  సోనియా ఆశీస్సులు, రాజకీయ అనుభవం, ధనబలం 
  • విజయవంతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు, నక్సల్ సమస్యలు తగ్గుముఖం, వ్యవసాయ ప్రాధాన్యం
ప్రతికూలాలు:
  • ఫాక్షన్ నేపధ్యం, అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత జన పక్ష పాతి
  • తెలంగాణా వ్యతిరేకి, శాంతి బాధరతల సమస్యలు 
  • సునిశిత  పరిపాలన దక్షణ లేకపోవడం 

చంద్రబాబు నాయుడు 
బలాలు:
  • పోరాట పటిమ, రాజకీయ అనుభవం, సునిశిత  పరిపాలన దక్షత, మీడియా మరియు ధనబలం
  • విజయవంతంగా  శాంతి బధ్రతలను  కాపాడటం, NTR కుటుంబ అండ
ప్రతికూలాలు:
  • ప్రజల సమస్యల పట్ల అవగాహన రాహిత్యం, కమ్యూనిస్టుల భా .జ.పా.ల మధ్య ఊగిసలాట, సైద్ధాంతిక నిబద్ధత లోపించడం 
  • అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత జన పక్ష పాతి
చిరంజీవి
బలాలు: 
  • ప్రజలలో పాపులారిటీ, కుటుంబ అండ, ధనబలం, మార్పు నినందం, సామజిక న్యాయం నినాదం
ప్రతికూలాలు:
  • రాజకీయ అనుభవం లేకపోవడం, సిద్దాంతాలు అసలు లేకపోవడం, కేవలం  వోట్ల బ్యాంకు మీద ఆధారపడడం, దేశ రాజకీయాల మీద, రాష్ట్ర రాజకీయాల మీద స్పష్టత లేకపోవడం, ప్రజల సమస్యల మీద అవగాహన రాహిత్యం 
N.T.R  తో పోలిస్తే చిరంజీవికి, 
  • N.T.R కు ఉన్న పాపులారిటీ ఉన్నప్పటికీ, ఆయనకున్న నిబద్ధత (రెండు రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం) లాంటి ఉన్నత ఆశయాలు  ఉన్నట్టు కనిపించడం లేదు.
  • N.T.R కు ఉన్న కమ్యూనికేషన్ మరియు కామ్పైనింగ్ లక్షణాలు కూడా కనిపించడం లేదు.

లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ 
బలాలు:  
          నీతిమంతుడు, ప్రజల సమస్యల పట్ల సాకేతిక పరమైన ఆలోచన విధానం, మద్య తరగతి ప్రజలలో  మంచి అవగహన 
ప్రతికూలాలు:
  • రాజకీయ అనుభవం లేకపోవడం, ధనబలం లేకపోవడం 
  • సిద్దాంతాలు, విధానాలు  ఏమిటో సరిగ్గా ప్రజలకు తెలియడం లేదు. 
  • కమ్యూనికేషన్ మరియు కామ్పైనింగ్ లక్షణాలు కూడా కనిపించడం లేదు
  • మార్పు నినాదం చాల విస్కృత మైనది. దాన్ని వివరణలో లోపాలు.